Thu Dec 26 2024 00:41:14 GMT+0000 (Coordinated Universal Time)
YSRCP :వారిని కో-ఆర్డినేటర్లుగా నియమించిన జగన్
వైసీపీ జిల్లాల్లో కో- ఆర్డినేటర్లను నియమించింది. అన్ని జిల్లాలకు సమన్వయకర్తలను నియమించింది
వైసీపీ జిల్లాల్లో కో- ఆర్డినేటర్లను నియమించింది. అన్ని జిల్లాలకు సమన్వయకర్తలను నియమిస్తూ పార్టీ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా వైఎస్ జగన్ ఈ సమన్వయకర్తలను జిల్లాలకు నియమించారు. జిల్లా అధ్యక్షులతో పాటు నియోజకవర్గ ఇన్ఛార్జులను సమన్వయం చేసుకునేందుకు సమన్వయ కర్తల నియామకం జరిగింది.
ఈ జిల్లాలకు వీరే...
స్వయంగా జగన్ ఈ సమన్వయ కర్తలను ప్రకటించారు. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాలకు ఎంపీ మిథున్ రెడ్డి, ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉమ్మడి కృష్ణా జిల్లాకు ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి, ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు బొత్స సత్యనారాయణ, ఉమ్మడి విశాఖ, శ్రీకాకుళం జిల్లాలకు విజయసాయిరెడ్డి, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలకు వైవీ సుబ్బారెడ్డిని నియమిస్తూ జగన్ ఆదేశాలు జారీ చేశారు.
Next Story