Wed Dec 18 2024 20:56:03 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : నేడు జగన్ ప్రచారం ఎక్కడంటే?
రోజుకు మూడు నియోజకవర్గాలను పర్యటిస్తూ వైసీపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నా వైసీపీ అధినేత వైఎస్ జగన్.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ గత రెండు రోజుల నుంచి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నెల 28వ తేదీన నియోజకవర్గాల వారీగా పర్యటిస్తున్నారు. రోజుకు మూడు నియోజకవర్గాలను పర్యటిస్తూ వైసీపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. తాము విడుదల చేసిన మ్యానిఫేస్టోను కూడా ప్రజలలోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీకి ఓటేస్తేనే సంక్షేమ పథకాలు కొనసాగుతాయని, టీడీపీకి ఓటేస్తే ముగింపు తప్పదని కూడా ప్రజలకు చెబుతున్నారు.
ఈరోజు మూడు నియోజకవర్గాల్లో...
ఈరోజు వైఎస్ జగన్ మూడు నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. ఉదయం పది గంటలకు ప్రకాశం జిల్లాలోని కొండపి నియోజకవర్గంలో పర్యటిస్తారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు కడప జిల్లాలోని మైదుకూరులో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అక్కడి నుంచి బయలుదేరి రాజంపేట లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని పీలేరు నియోజకవర్గంలో జరిగే బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తారు.
Next Story