YSRCP : జగన్ లో మార్పు రాదా? చేసిన తప్పులు ఒప్పుకుని తీరాల్సిన టైంలో కూడా?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇటీవల ఎన్నికల్లో ఓటమిపై రెండు రోజుల నుంచి సమీక్షలు నిర్వహించారు
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇటీవల ఎన్నికల్లో ఓటమిపై రెండు రోజుల నుంచి సమీక్షలు నిర్వహించారు. మొదటి రోజు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో, రెండో రోజు రాజ్యసభ సభ్యులు, పార్లమెంటు సభ్యులతో ఆయన సమావేశమయ్యారు. ఓటమి తర్వాత సమీక్షించుకోవడం తప్పు లేదు. అది జరిగి తీరాల్సిందే. కానీ సమీక్షలో కూడా క్షేత్ర స్థాయిలో ఉన్న నేతల ఫీడ్ బ్యాక్ కంటే తాను అనుకున్న అభిప్రాయాలనే సమీక్షలను పరిమితం చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సమీక్ష అంటే అర్థాన్నే మార్చేశారు వైసీీపీ చీఫ్. తనకు ఎవరో ఇచ్చిన నివేదికలను మళ్లీ జగన్ నమ్ముకుని అందుకే ఓటమి చెందామన్న భ్రమలో పార్టీ అధినేత ఉన్నట్లు కనిపించింది. ఇలాగే కొనసాగితే ముందు ముందు కష్టాలు తప్పవు. అనుకోని కష్టాలు ఎదుర్కొనాల్సి వస్తుంది. అన్నింటికీ సిద్ధపడినా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం మళ్లీ చేయాలంటే లీడర్లకే పూర్తి బాధ్యతలను అప్పగించాలి.