Sun Dec 22 2024 22:38:01 GMT+0000 (Coordinated Universal Time)
వైఎస్ జగన్ ట్వీట్.. లోకేష్ కౌంటర్
వైసీపీ అధినేత జగన్ బద్వేల్ లో విద్యార్థిపై హత్యాచారం చేసిన ఘటనను ఖండించారు. నారా లోకేష్ దానికి కౌంటర్ ఇచ్చారు
వైసీపీ అధినేత జగన్ బద్వేల్ లో విద్యార్థిపై హత్యాచారం చేసిన ఘటనను ఖండించారు. ఇదేమి రాజ్యం అంటూ ట్వీట్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలు, యువతులపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయని ఆయన ఆవేదన చెందారు. అసలు రాష్ట్రంలో శాంతి భద్రతలున్నాయా? అని ప్రశ్నించారు. కనీసం లా అండ్ ఆర్డ్ ను కూడా కాపాడలేకపోతున్నారని అన్నారు. ప్రతిరోజూ ఏదోచోట హత్యాచారాలు, హత్యలు, వేధింపులు సర్వసాధారణమైపోయాయని, బద్వేలు ఘటన వెనుక రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు వ్యవస్థల వైఫల్యంకూడా ఉంది. ఒక పాలకుడు ఉన్నాడంటే ప్రజలు ధైర్యంగా ఉండాల్సిందిపోయి నిరంతరం భయపడే స్థాయికి రాష్ట్రాన్ని తీసుకెళ్లారంటూ మండిపడ్డారు.
లోకేష్ ఏమన్నారంటే?
జగన్ ట్వీట్ కు లోకేష్ కౌంటర్ ఇచ్చారు. ఇంట్లో బాబాయ్‌ని చంపేసిన పచ్చి నెత్తురు తాగే రాక్షసుడు జగన్ అని లోకేష్ మండిపడ్డారు. మీ పార్టీ పునాదులే నేరాలు- ఘోరాలు అని మీ కుటుంబ సభ్యులే చెప్పారాన్నరు. మీ పాలనలో వేల మంది చనిపోయినా, ఏ నాడు ఒక్క మాట, కనీసం ఒక్క సమీక్ష కూడా చేయని మీరు, లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నావని ప్రశ్నించారు. మా ఖర్మ.. 5 ఏళ్ళ పాటు గంజాయి, డ్రగ్స్ ని వ్యాప్తి చేసి సొమ్ము చేసుకున్నావని ఫైర్ అయ్యారు. ఊరికో ఉన్మాదిని పెంచి పోషించి, ప్రజల మీదకు వదిలావని, నేరస్తులు ఇష్టం వచ్చినట్టు బ్రతికే లైసెన్స్ ఇచ్చావని లోకేష్ మండిపడ్డారు.
Next Story