Tue Dec 24 2024 16:47:10 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : లడ్డూ కల్తీపై మరోసారి జగన్ సంచలన వ్యాఖ్యలు
తిరుమలలో లడ్డూ కల్తీ వ్యవహారంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మరోసారి స్పందించారు
తిరుమలలో లడ్డూ కల్తీ వ్యవహారంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మరోసారి స్పందించారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. సుప్రీంకోర్టు తీర్పుపై కూడా ఆయన మాట్లాడారు. సుప్రీంకోర్టు ధర్మాసనం అడిగిన ప్రశ్నలు చూస్తే అసలు సిట్ అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. రాజకీయ డ్రామాలు చేయవద్దని ఉన్నత న్యాయస్థానం గట్టిగా చెప్పిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. కానీ తెలుగుదేశం పార్టీ తన సోషల్ మీడియాలో నేటికీ అసత్య ప్రచారం చేస్తూనే ఉందన్నారు. లడ్డూ కల్తీ జరగలేదని, అన్ని ఆధారాలు చెబుతున్నా పదే పదే అదే అబద్ధాలు చెబుతూ చంద్రబాబు నిజం చేయాలని ప్రయత్నిస్తున్నారన్నారు.
కోర్టు నిర్ణయాన్ని...
సుప్రీంకోర్టు నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కోసమే చంద్రబాబు మత విశ్వాసాలను రెచ్చగొట్టారన్నారు. జంతువుల కొవ్వుతో ఎవరైనా స్వామి వారి లడ్డూను తయారు చేస్తారా? అని జగన్ ప్రశ్నించారు. లడ్డూ వివాదం విషయంలో చంద్రబాబుకు సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిందని జగన్ అన్నారు. చంద్రబాబు వేసిన సిట్ ను సుప్రీంకోర్టు రద్దు చేయడమే ఇందుకు నిదర్శనమని జగన్ అన్నారు. చంద్రబాబుకు నిజంగా తిరుమల వెంకటేశ్వరస్వామిపై భక్తి ఉంటే వెంటనే ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఆయన కోరారు. సుప్రీంకోర్టు అక్షింతలు వేసినా చంద్రబాబు తీరు మారలేదని వైెఎస్ జగన్ అన్నారు. తిరుమల పవిత్రతను చంద్రబాబు అపవిత్రం చేశారంటూ జగన్ మండిపడ్డారు.
Next Story