Sun Dec 14 2025 06:12:53 GMT+0000 (Coordinated Universal Time)
యాక్షన్ ప్లాన్ కు సిద్ధం...వైఎస్ జగన్ కీలక భేటీ
వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ పార్టీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. రాష్ట్ర భవిష్యత్ కార్యాచరణపై ఆయన చర్చించనున్నారు

వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ పార్టీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. రాష్ట్ర భవిష్యత్ కార్యాచరణపై ఆయన చర్చించనున్నారు. ముఖ్యనేతలతో సమావేశమై పార్టీని వీడకుండా అవసరమైన చర్యలు ఏమేం తీసుకోవాలో? అన్న దానిపై సీనియర్ నేతలతో జగన్ చర్చలు జరుపుతున్నారు. ప్రధానంగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి పార్టీకి రాజీనామా చేయడంతో అక్కడ ఎవరిని ఇన్ఛార్జిగా నియమించాలన్న దానిపై వైఎస్ జగన్ నేతలతో చర్చిస్తున్నట్లు తెలిసింది.
తిరుమల లడ్డూ....
దీంతో పాటు మిగిలిన నేతలు కొందరు పార్టీని వీడి వెళ్లే అవకాశమున్నందన, వారిని ఎలా కట్టడి చేయాలి? లేకపోతే వారు పార్టీని వీడివెళితే ఎవరెవరని ఆ స్థానంలో నియమించాలన్న దానిపై కూడా నేతలతో మాట్లాడుతున్నారు. దీంతో పాటు తిరుమల లడ్డూ వివాదంపై కూడా జగన్ నేతలతో చర్చించే అవకాశాలున్నాయి. దీనిని తిప్పికొట్టేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని జగన్ నేతలను కోరనున్నారు. ఈ సమావేశానికి కొందరు ముఖ్యనేతలతో పాటు వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి కూడా హాజరయ్యారు.
Next Story

