Wed Nov 20 2024 05:39:03 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan :వైఎస్ జగన్ బీజేపీకి దూరమవుతున్నారా? అందుకే ఇటువంటి నిర్ణయాలా?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ క్రమంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి దూరం అవుతున్నట్లే కనిపిస్తుంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ క్రమంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి దూరం అవుతున్నట్లే కనిపిస్తుంది. గత పదేళ్లపాటు వైఎస్ జగన్ బీజేపీతో సఖ్యతగా ఉన్నారు. నేరుగా మద్దతు లేకపోయినా పరోక్షంగా అనేక బిల్లులకు వైసీపీ మద్దతు ఇచ్చారు. ప్రధానంగా రాజ్యసభలో వైసీపీ బీజేపీకి అండగా ఉండటంతో అనేక బిల్లులు గట్టెక్కాయి. అనేక సందర్భాల్లో బీజేపీ చెప్పినట్లే జగన్ నడుచుకున్నారన్న కామెంట్స్ వినిపించాయి. ఎందుకంటే పదేళ్ల పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని తాను ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా ఆయన పెద్దగా వ్యతిరేకించలేదు. ప్రతి అంశాన్ని కూడా జగన్ బలపర్చి పరోక్షంగా కమలం ప్రభుత్వానికి మద్దతు తెలిపారు.
పదేళ్ల పాటు....
ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీ గెలిచినా బీజేపీకి అనుకూలంగానే ఉంటుందన్న భావన కలిగించారు. ఇటు టీడీపీ, అటు జనసేన, వైసీపీ మద్దతు నేరుగానో, పరోక్షంగానో ఇస్తుండటం గత దశాబ్దకాలం నుంచి జరుగుతుంది. అయితే మొన్నటి ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కట్టాయి. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నందునే ఈవీఎలను ట్యాంపరింగ్ చేయగలిగారని, అందుకే కేవలం వైసీపీకి పదకొండు స్థానాలు మాత్రమే వచ్చాయని వైఎస్ జగన్ కుండబద్దలు కొట్టేశారు. టీడీపీ 2014లో మద్దతు పెట్టుకుని తర్వాత ప్రత్యేక హోదా కోసం బయటకు వచ్చి మోదీ, అమిత్ షాపై విమర్శలు చేసినా మళ్లీ 2024 ఎన్నికల్లో బీజేపీ పెద్దలు టీడీపీతో పొత్తు పెట్టుకోవడాన్ని వైఎస్ జగన్ తప్పుపడుతున్నారు.
ఓటమి పాలయిన నాటి నుంచి...
అయితే 2024 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన నాటి నుంచి కొంత బీజేపీపై వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు వైఎస్ జగన్. నేరుగా విమర్శలు చేయకపోయినా కొన్ని అంశాల్లో విభేదాలించాలని వైఎస్ జగన్ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. మరోవైపు తమపార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులను కూడా తమ పార్టీలో కలుపుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తుందన్న అనుమానాలను వైఎస్ జగన్ వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నలుగురైదుగురు రాజ్యసభ ఎంపీలతో బీజేపీ టచ్ లోకి వెళ్లినట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వైఎస్ జగన్ బీజేపీ విషయంలో కీలక నిర్ణయమే తీసుకున్నట్లు తెలిసింది. ప్రధానంగా ఇకపై బీజేపీ కూటమితో దూరం పాటించాలని వైెస్ జగన్ డిసైడ్ అయినట్లు చెబుతున్నారు.
లోక్సభ లో నేడు బిల్లును...
అందులో భాగంగానే నేడు లోక్సభలో వక్ఫ్ సవరణ బిల్లును వైసీపీ వ్యతిరేకించింది. టీడీపీ, జనసేన వంటి పార్టీలు దానిని సమర్థించినా వైసీపీ మాత్రం లోక్సభలో వ్యతిరేకించడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లును వైసీపీ వ్యతిరేకించింది. ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలను సమర్థించింది. వైసీపీ, టీఎంసీ, సమాజ్ వాదీ పార్టీ, కాంగ్రెస్, మజ్లిస్, కమ్యునిస్టు పార్టీలు వ్యతిరేకించాయి. దీంతో రాష్ట్రంలో కమ్యునిస్టులను కలుపుకుని అధికార కూటమిపై పోరాటం చేయాలని వైఎస్ జగన్ భావిస్తున్నట్లు తెలిసింది. అందుకోసమే తొలి అడుగు పడిందని, రానున్న కాలంలో ప్రజావ్యతిరేక బిల్లులను వ్యతిరేకించడానికి వైెఎస్ జగన్ వ్యతిరేకిస్తామన్ నంకేతాలను ఇండియా కూటమికి కూడా పంపగలిగారు. దేశ వ్యాప్తంగా తనకు మద్దతు కావాలంటే బేజేపీని వదిలించుకోవడానికి సిద్ధమయినట్లు సమాచారం.
Next Story