Mon Dec 23 2024 04:44:06 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : మళ్లీ జగన్ ప్రచారానికి సర్వం సిద్ధం
వైసీపీ అధినేత జగన్ మరోసారి ప్రచారానికి సిద్ధమయ్యారు. రోజుకు మూడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు
వైసీపీ అధినేత జగన్ మరోసారి ప్రచారానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే సిద్ధం పేరుతో నాలుగు సభలతో పాటు ఇరవై రెండు రోజుల పాటు బస్సు యాత్ర నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సభలకు మంచి రెస్పాన్స్ రావడంతో మళ్లీ నియోజకవర్గాల వారీగా ప్రచారాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ నెల 28వ తేదీ నుంచి మే 1వ తేదీ వరకూ జగన్ ఎన్నికల ప్రచారానికి సంబంధించిన షెడ్యూల్ ను తయారు చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. బహిరంగ సభలలో ప్రసంగించనున్నారు. ఏప్రిల్ 28 నుంచి ప్రారంభమై ప్రతి రోజూ 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బహిరంగ సభలులో జగన్ పాల్గొంటారు.
షెడ్యూల్ ఇదే...
ఈ నెల 28న ఉదయం పది గంటలకు తాడిపత్రి . 12:30 గం.లకు: వెంకటగిరి . 03:00 గం.లకు కందుకూరు నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. 29వ తేదీన ఉదయం 10 గంటలకు చోడవరం నియోజకవర్గం, మధ్యాహ్నం 12:30 గంటలకు పి.గన్నవరం, సాయంత్రం మూడు గంటలకు పొన్నూరు నియోజకవర్గంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. 30వ తేదీన ఉదయం 10గంటలకు కొండపి, మధ్యాహ్నం 12:30 గంటలకు మైదుకూరు, సాయంత్రం పీలేరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. మే 1వ తేదీన ఉదయం 10 గంటలకు బొబ్బిలి, మధ్యాహ్నం 12:30 గం.లకుపాయకరావుపేట , సాయంత్రం ఏలూరు నియోజకవర్గంలో జరిగే బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు.
Next Story