Sun Dec 22 2024 17:40:27 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : జగన్ వద్దకు క్యూ కట్టిన జనం
పులివెందులలో వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరిస్తున్నారు
పులివెందులలో వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరిస్తున్నారు. పులివెందుల క్యాంప్ కార్యాలయంలో ఉన్న జగన్ ను కలిసేందుకు ప్రజలు తరలి వచ్చారు. తమ సమస్యలను విన్నవించుకుంటున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నేరుగా కలవడానికి కుదరని చోటామోటా నేతలు కూడా వచ్చి జగన్ ను కలుస్తున్నారు. పార్టీ ఓటమికి గల కారణాలను వాళ్లు జగన్ కు చెబుతున్నారు.
వ్యక్తిగత సమస్యలు...
మరోవైపు ప్రజలు కూడా క్యాంప్ కార్యాలయానికి వచ్చి నేరుగా తమ సమస్యలను జగన్ కు చెప్పుకుంటున్నారు. వ్యక్తిగత సమస్యలను ఎక్కువగా ప్రస్తావిస్తుండటంతో జగన్ వారి సమస్యలను సావధానంగా వింటూ పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నారు. అధికారులకు వారి వినతి పత్రాలను అందచేస్తానని చెబుతున్నాు.
Next Story