Sun Jan 05 2025 03:50:46 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : ఇంకా రెస్ట్ మోడ్ లోనే జగన్
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇంకా రెస్ట్ మోడ్ లోనే ఉన్నారు
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇంకా రెస్ట్ మోడ్ లోనే ఉన్నారు. పులివెందులలో ఐదు రోజుల పర్యటన అని చెప్పి వెళ్లిన జగన్ అక్కడ రెండు రోజులు ఉండి నేరుగా బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు. బెంగళూరులోని తన ఇంట్లో ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఊహించని విధంగా ఓటమిని చవిచూసిన జగన్ తర్వాత కొందరు నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఓటమిపై విశ్లేషణలు జరిపారు. కార్యకర్తలకు అండగా ఉండాలని ఆయన దిశానిర్దేశం చేశారు.
బెంగళూరులోనే...
అయితే కొద్ది రోజుల నుంచి ఆయన బెంగళూరులోనే ఉన్నారు. రాష్ట్రంలో పార్టీకార్యాలయాలను నిబంధనలకు అనుగుణంగా లేవని అధికారులు కూల్చివేస్తున్నారు. ఈనేపథ్యంలో జగన్ కోసం నేతలు ఎదురుచూస్తున్నారు. జగన్ తాడేపల్లికి ఎప్పుడు చేరుకుంటారో సమాచారం తెలియక వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిలను నేతలను సంప్రదిస్తున్నారు. అయితే వైెస్ జగన్ ఈరోజు, రేపట్లో విజయవాడకు వస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఎప్పుడు వస్తారన్నది మాత్రం ఇంకా స్పష్టత లేదు.
Next Story