Tue Dec 24 2024 03:11:25 GMT+0000 (Coordinated Universal Time)
ప్రతి ఎమ్మెల్యేను గెలిపించుకుంటా : జగన్
ఎమ్మెల్యేలతో జరిగిన సమీక్ష సమావేశంలో వైసీపీ అధినేత జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు
ఎమ్మెల్యేలతో జరిగిన సమీక్ష సమావేశంలో వైసీపీ అధినేత జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లేది లేదని తేల్చి చెప్పారు. మామూలుగానే ఎన్నికలకు వెళతామని జగన్ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జులకు స్పష్టం చేశారు. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం సమీక్షలో భాగంగా జగన్ ఈ కామెంట్స్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమపై దుష్ప్రచారం చేస్తున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 21 స్థానాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే పదిహేడు స్థానాల్లో వైసీపీయే గెలిచిందన్న విషయాన్ని జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. మనం మారీచులతో యుద్ధం చేస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్యేలతో సమావేశం ముగిసింది.
ముందస్తు ఎన్నికలకు వెళ్లేది లేదు...
ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యేలంతా క్రియాశీలకంగా వ్యవహరించాలన్నారు. ఒక్క ఎమ్మెల్యేను కూడా వదులుకోమని, అందరినీ గెలిపించుకుంటామని తెలిపారు. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో ప్రతి గడపకు తిరగాలని అన్నారు. టీడీపీ వాపును చూసి బలంగా భావిస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లో అందరినీ గెలిపించుకుంటామని తెలిపారు. పట్టభద్రుల యూనియన్లలో రకరకాల యూనియన్లు ఉన్నాయన్నారు. ఇది వచ్చే ఎన్నికలకు ఏమాత్రం శాంపిల్ కాదని తెలిపారు. ఎమ్మెల్యేలు యాక్టివ్ గా ఉండి ప్రజల్లోకి వెళ్లాలని, వచ్చే సెప్టంబరు నుంచి కొత్త కార్యక్రమాన్ని ఇస్తామని తెలిపారు.
Next Story