Mon Dec 23 2024 04:39:28 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : నేడు విశాఖ జిల్లాలోకి జగన్ బస్సు యాత్ర
వైఎస్ జగన్ మేమంతా బస్సు యాత్ర నేటికి పందొమ్మిదో రోజుకు చేరుకుంది.
వైఎస్ జగన్ మేమంతా బస్సు యాత్ర నేటికి పందొమ్మిదో రోజుకు చేరుకుంది. గత నెల 27వ తేదీన ఇడుపులపాయలో వైఎస్ జగన్ ఈ బస్సు యాత్రను ప్రారంభించారు. కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల మీదుగా నిన్న తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించారు. నేడు విశాఖ జిల్లాలో జగన్ పర్యటించనున్నారు.
రోడ్ షోల ద్వారా...
ఈరోజు నైట్ బస చేసిన గోడిచర్ల నుంచి బయలుదేరి నక్కపల్లి, పులపర్తి, యలమంచిలి బైపాస్ మీదుగా అచ్యుతాపురం చేరుకుంటారు. అక్కడ భోజనవిరామానికి ఆగుతారు. అనంతరం నరసింగపల్లి మీదుగా సాయంత్రం బయలుదేరి చింతపాలెం వద్ద జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం బయ్యవరం, కశింకోట, అనకాపల్లి బైపాస్ మీదుగా చిన్నయపాలెం వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బసకు చేరుకుంటారు.
Next Story