Mon Dec 23 2024 14:23:42 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : నేడు 21వ రోజు విజయనగరం జిల్లాలోకి
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మేమంతా బస్సుయాత్ర నేడు విజయనగరం జిల్లాలోకి చేరనుంది. నేటికి 21వ రోజుకు యాత్ర చేరుకుంది
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మేమంతా బస్సుయాత్ర నేడు విజయనగరం జిల్లాలోకి చేరనుంది. నేటికి 21వ రోజుకు యాత్ర చేరుకుంది. ఉదయం 9 గంటలకు ఎండాడ ఎంవీవీ సిటీ నైట్ క్యాంప్ నుంచి జగన్ బయలుదేరుతారు. మధురవాడ మీదుగా ఆనందపురం చేరుకుని చెన్నాస్ కన్వెన్షన్ హాలు వద్ద సోషల్ మీడియా కార్యకర్తలతో ఆయన సమావేశం అవుతారు.
సోషల్ మీడియా కార్యకర్తలతో...
సోషల్ మీడియా కార్యకర్తలతో ముఖాముఖి ఆయన మాట్లాడతారు. రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన విధానాన్ని వివరించనున్నారు. తర్వాత తగరపువలస మీదుగా జొన్నాడ చేరుకుంటారు. జొన్నాడ దాటిన తర్వాత భోజన విరామానికి జగన్ ఆగుతారు. మధ్యాహ్నం బొద్దవలస మీదుగా సాయంత్రం చెల్లూరు వద్ద జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం చింతవలస, భోగాపురం, రణస్థలం మీదుగా అక్కివలస నైట్ క్యాంప్ నకు జగన్ చేరుకుంటారు.
Next Story