Fri Dec 27 2024 07:30:06 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : చంద్రబాబు ప్రజాగ్రహానికి గురి కాక తప్పదు
చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేస్తున్నారని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ అన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేస్తున్నారని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ అన్నారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలంలో మాడుగుల నియోజకవర్గ జడ్పీటీసీ, ఎంపీటీసీలతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజాగ్రహానికి చంద్రబాబు ప్రభుత్వం గురికాక తప్పదని తెలిపారు. ప్రజలను ఆశపెట్టి అధికారంలోకి వచ్చి తర్వాత హామీలను అమలు చేయడం మానేశారన్నారు.
వైసీపీ ప్రభుత్వం అధికారంలో...
గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఖజానా నిండా డబ్బులు లేవని, అయినా సరే సాకులు చెప్పలేదని, సంక్షేమ పథకాలను అమలు చేసి చూపించామని వైఎస్ జగన్ చెప్పారు. మాట ఇచ్చిన తర్వాత దానిని నిలుపుకోవడానికే మనం ప్రయత్నించామన్న జగన్ శక్తికి మించి పనిచేశామని తెలిపారు. చంద్రబాబు బిర్యానీ పెడతాడని భావించి ప్రజలు అందలం ఎక్కిస్తే ప్రజలకు ఉత్త చేతులు చూపుతున్నారన్నారు. ఇంతవరకూ రైతు భరోసా అందలేదని, ఫీజు రీఎంబర్స్మెంట్, తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి ఊసే ఎత్తడం లేదన్నారు.
Next Story