Thu Dec 26 2024 18:29:24 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : మళ్లీ మనదే అధికారం..నేతలతో జగన్
ప్రజల ఆశీర్వాదం వల్లనే తాను దాడి నుంచి తప్పించుకున్నానని వైసీపీ అధినేత జగన్ అన్నారు
ప్రజల ఆశీర్వాదం వల్లనే తాను దాడి నుంచి తప్పించుకున్నానని వైసీపీ అధినేత జగన్ అన్నారు. రాయి దాడి జరిగిన తర్వాత మళ్లీ బస్సు యాత్ర ప్రారంభించడానికి ముందు వైసీపీ నేతలతో జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి దాడులు ఏవీ మనల్ని ఆపలేవని, దేవుడి దయ, ప్రజల ఆశీర్వాదాలు మనకు ఉన్నాయని జగన్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఎవరూ అధైర్యపడాల్సిన పనిలేదని, ధైర్యంగా ముందుకు వెళదామని ఆయన అన్నారు.
అధైర్యం వద్దు...
మరోసారి అధికారంలోకి వస్తున్నామని జగన్ ఈ సందర్భంగా నేతలకు తెలిపారు. ఇలాంటి దాడులు మనకు ఆపుతాయా? అని ప్రశ్నించారు. ఎవరూ అధైర్యపడవద్దంటూ జగన్ వారికి ధైర్యం తెలిపారు. నేతలతో మాట్లాడిన అనంతరం జగన్ బస్సు యాత్రకు బయలుదేరి వెళ్లారు. కాసేపట్లో ఆయన యాత్ర గుడివాడలోకి ప్రవేశించనుంది. సాయంత్రం గుడివాడలో జరిగే సభలో ప్రసంగించనున్నారు.
Next Story