Sun Dec 22 2024 14:48:16 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : ఓటమితో కన్నీటి పర్యంతమయిన జగన్.. ఆ మంచి ఏమయిందోనంటూ?
ఫలితాలను చూసి ఆశ్చర్యంగా ఉందని వైసీపీ అధినేత జగన్ అన్నారు. ఇలాంటి ఫలితాలను తాము ఊహించలేదని అన్నారు.
ఫలితాలను చూసి ఆశ్చర్యంగా ఉందని వైసీపీ అధినేత జగన్ అన్నారు. ఇలాంటి ఫలితాలను తాము ఊహించలేదని అన్నారు. అమ్మఒడి అందుకున్న వారు యాభై నాలుగు లక్షల మంది అక్కా చెల్లెళ్లు తమను ఎందుకు తిరస్కరించారో తెలియదన్నారు. 63 లక్షల మంది అవ్వాతాతల కష్టాలను తెలుసుకుని వారి ఇంటికే పింఛన్లు పంపామని, ఎంతో మంచి చేస్తూ అడుగులు వేసినా ఆ అవ్వాతాతలు చూపిన ఆప్యాయత ఏమయిందో తెలియదన్నారు. కోటి ఐదు లక్షల మంది అక్క చెల్లెమ్మలకు మంచి చేసినా, ఇచ్చిన ఏ మాట తప్పకుండా అన్ని రకాలుగా వారికి అండగా ఉంటూ ఆసరాతో తోడుగా ఉన్నామని, సున్నా వడ్డీతో అండగా నిలిచామని వారి ప్రేమాభిమానాలు ఏమయ్యాయో తెలియదన్నారు.
చేయూతను ఇచ్చినా...
26 లక్షల మంది చేయూతను అందుకున్న అక్క చెల్లెమ్మల ఆప్యాయత ఎక్కడికి వెళ్లిందో తెలియదన్నారు. పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ చేసి, చదువుల్లో పూర్తి మార్పులు తీసుకు వచ్చినా ఆ పిల్లలు, తల్లుల అభిమానం ఏమయిందో తెలియదన్నారు. యాభై నాలుగు లక్షల మంది రైతన్నలకు గతంలో ఎన్నడూ చూడని విధంగా పెట్టుబడి సాయం అందించామని, రైతు భరోసా ఇచ్చినా, సమాయానికి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినప్పటికీ, ఉచిత ఇన్సూరెన్స్ ఇచ్చినా, ఉచిత విద్యుత్తు ఇచ్చినా వారి ప్రేమ ఏమయిందో తెలియదని జగన్ అన్నారు. ఇన్నికోట్ల మందికి పేదవాడికి తోడుగా ఉంటూ, ఆటోలను నడుపుకుంటున్న వారికి అండగా ఉన్నామని, నేతన్నలకు అండగా నిలిచామని, మత్స్యాకారులకు మంచి చేశామని, చిరు వ్యాపారులకు చేదోడుగా నిలిచామని, రజకులు, నాయీ బ్రాహ్మణులకు ఏమయిందో తనకు తెలియదన్నారు.
మంచి చేసినా..
ఇన్ని కోట్ల మందికి మంచి, ఎప్పుడూ జరగని విధంగా మ్యానిఫేస్టోను 99 శాతం అమలు చేసి, అంతే చిత్తశుద్ధితో నిబద్ధత గల ప్రభుత్వంగా పనిచేశామని తెలిపారు. నాణ్యమైన విద్యఅవసరం అని భావించి పెత్తందారులతో యుద్ధం చేశామని తెలిపారు. సచివాలయం, వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి అవినీతికి లేకుండా పాలన అందించామని, ఎప్పుడూ చూడని మార్పులు తీసుకు రావడమే కాకుండా, విద్య, వైద్యం, వ్యవసాయ రంగంలో ఊహించని విధంగా మార్పులు తీసుకు వచ్చామని తెలిపారు. మంచి చేయడానికి ప్రజలకు తోడుగా ఉంటామని చెప్పారు. మాటలు రావడం లేదన్నారు. పేద వాడికి అండగాఉండేకార్యక్రమంలో వైసీపీ గళం విప్పుతుందన్నారు. కూటమిలో ఉన్న బీజేపీకి, చంద్రబాబుకు, పవన్ కల్యాణ్ కు జగన్ అభినందనలు తెలిపారు. జరగబోయే పరిణామాలకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. తన రాజకీయ జీవితమంతా ప్రతిపక్షంలోనే ఉన్నానని, ఎలంటి పరిస్థితులనైనా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఎన్ని కష్టాలనయినా ఎదుర్కొంటామని అందుకు సిద్ధంగా ఉన్నామని జగన్ తెలిపారు.
Next Story