Mon Dec 23 2024 11:22:28 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : ముందే అలెర్ట్ వచ్చినా ప్రభుత్వం స్పందించలేదు
ఈ వరదలకు మానవ తప్పిదమే కారణమని వైసీపీ చీఫ్ వైెఎస్ జగన్ అన్నారు
ఈ వరదలకు మానవ తప్పిదమే కారణమని వైసీపీ చీఫ్ వైెఎస్ జగన్ అన్నారు. గతంలో కూడా వరదలు వచ్చాయని, అయితే ప్రాణ నష్టం జరగలేదన్నారు. ఆగస్టు 28వ తేదీనే వాతావరణ శాఖ అలెర్ట్ వచ్చిందని, కానీ ప్రభుత్వం అందుకు సిద్ధం కాలేదని అన్నారు. భారీ వర్షాలు పడతాయని ముందే హెచ్చరికలు వచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.
ప్రభుత్వ వైఫల్యమే...
వైఎస్ జగన్ వరద ముంపునకు గురైన సింగ్ నగర్ ప్రాంతంలో వైఎస్ జగన్ పర్యటించారు. ప్రభుత్వం కక్ష సాధింపు తప్ప సహాయక చర్యలు పట్టించుకోలేదన్నారు. పునరావాస కేంద్రాలను తగినన్ని ఏర్పాటు చేయలేదన్నారు. ప్రభుత్వ వైఫల్యం అన్ని రకాలుగా కొట్టొచ్చినట్లు కనిపిస్తుందన్నారు. గతంలో వాలంటీర్లంతా సహాయం అందించేవారన్నారు. గతంలో వరదలు వచ్చి ఇల్లు మునిగిపోతే ప్రతి కుటుంబానికి ఆర్థిక సాయాన్ని అందించామని తెలిపారు. కానీ ఈ ప్రభుత్వం ఆర్థిక సాయం అందించడానికి ముందుకు రాకపోవడం విచారకరమని అన్నారు.
Next Story