Sun Dec 14 2025 09:57:48 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : నేడు రెండో రోజు కడపలో జగన్
వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు కడప జిల్లాలో రెండో రోజు పర్యటించనున్నారు.

వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు కడప జిల్లాలో రెండో రోజు పర్యటించనున్నారు. నిన్న ఉదయం పులివెందుల చేరుకున్న జగన్ నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. నేడు పులివెందులలో ఐ కేర్ సెంటర్ ను జగన్ ప్రారంభించనున్నారు. నిన్న నేతలు, కార్యకర్తలతో సమావేశమైన జగన్ వారి సమస్యలను అడిి తెలుసుకున్నారు.
ఐ కేర్ సెంటర్ ను ప్రారంభించిన అనంతరం...
ఈరోజు ఉదయం పదిన్నర గంటలకు ఐ కేర్ సెంటర్ ను ప్రారంభించిన అనంతరం ఆయన బెంగళూరు బయలుదేరి వెళతారు. జగన్ రెండు రోజుల కడప జిల్లా పర్యటనలో నేతలకు ధైర్యం చెప్పారు. తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అధికార పార్టీ పెట్టే ప్రలోభాలకు లొంగిపోవద్దని, మనం తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని నేతలకు చెప్పారు. అనంతరం నేడు పులివెందుల నుంచి బయలుదేరి బెంగళూరుకు వెళ్లనున్నారు.
Next Story

