Mon Mar 17 2025 23:17:27 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : నేడు విజయవాడకు వైఎస్ జగన్
వైసీపీ అధినేత జగన్ నేడు బెంగళూరు నుంచి విజయవాడకు రానున్నారు.

వైసీపీ అధినేత జగన్ నేడు బెంగళూరు నుంచి విజయవాడకు రానున్నారు. ఆయన విజయవాడలోని అడుసుమిల్లి జయప్రకాశ్ ఇంటికి వెళ్లనున్నారు. ఇటీవల అడుసుమిల్లి జయ ప్రకాష్ మరణించారు. ఆయన కుటుంబ సభ్యులను నేడు జగన్ పరామర్శించడానికి వారి ఇంటికి వెళతారు. తర్వాత తాడేపల్లికి చేరుకుంటారు.
పార్టీ నేతలతో...
అనంతరం వైఎస్ జగన్ ఈరోజు పార్టీ నేతలతో సమావేశమవుతారని తెలిసింది. కొందరు ముఖ్య నేతలతో నేడు సమావేశమై పార్టీ అంతర్గత విషయాలతో పాటు రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. జగన్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను వైసీపీ నేతలు ముందస్తుగానే చేశారు.
Next Story