Tue Mar 18 2025 00:31:57 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : నేడు బెంగళూరు నుంచి తాడేపల్లికి జగన్
వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు విజయవాడ రానున్నారు. ముఖ్య నేతలతో సమావేశమై రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు విజయవాడ రానున్నారు. సాయంత్రం 5.30 గంటలకు జగన్ గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి తాడేపల్లిలోని తన ఇంటికి చేరుకోనున్నారు. ఎన్నికల్లో ఓటమి పాలయిన దగ్గర నుంచి వైఎస్ జగన్ ఎక్కువగా బెంగళూరులోనే సమయం గడుపుతున్న సంగతి తెలిసిందే.
నేతలతో సమావేశం...
ఈరోజు బెంగళూరు నుంచి బయలుదేరి తాడేపల్లికి రానున్నారు. ఈరోజు సాయంత్రం ముఖ్య నేతలతో సమావేశమై రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారని తెలిసింది. రేపు కూడా జగన్ పార్టీకి చెందిన ముఖ్య నేతలతో పాటు వివిధ జిల్లాల నుంచి వచ్చిన నేతలతో సమావేశమవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి.
Next Story