Mon Dec 23 2024 11:20:45 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : వైఎస్ జగన్ నేడు ఎన్నికల ప్రచారం ఇలా
వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు
వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. మూడు నియోజకవర్గాల్లో ఆయన పర్యటించనున్నారు. నిన్న ప్రచారానికి విరామమిచ్చిన జగన్ నేడు మళ్లీ ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఈరజు ఉదయ పది గంటలకు బాపట్ల జిల్లాలోని రేపల్లె నియోజకవర్గంలో జరిగే ప్రచార సభలో జగన్ పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
వరస సభలతో...
మధ్యాహ్నం 12.30 గంటలకు నరసరాపుపేట లోక్సభ పరిధిలోని మాచర్లలో జరిగే సభకు ఆయన హాజరవుతారు. తిరిగి సాయంత్రం మచిలీపట్నంలో జరిగే ప్రచారంలో ఆయన పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. జగన్ సభలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపాయి. ఇంకా ప్రచారానికి ఎక్కువ రోజుల సమయం లేనందున జగన్ విస్తృతంగా నియోజకవర్గాలను చుట్టివచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
Next Story