Sat Dec 21 2024 11:20:35 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : 22న జగన్ నామినేషన్
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈ నెల 22వ తేదీన నామినేషన్ దాఖలు చేయనున్నారు
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈ నెల 22వ తేదీన నామినేషన్ దాఖలు చేయనున్నారు. పులివెందుల నియోజకవర్గంలో ఆయన తన నామినేషన్ ను దాఖలు చేయనున్నారు. ఈ నెల 21వ తేదీతో మేమంతా బస్సు యాత్ర పూర్తి కానుంది. గత నెల 27వ తేదీన ఇడుపులపాయలో ప్రారంభమైన మేమంతా ిసిద్ధం బస్సు యాత్ర ఈ నెల 21వ తేదీన ఇచ్ఛాపురంలో ముగియనుంది.
భారతి ప్రచారం...
బస్సు యాత్ర ముగించుకున్న అనంతరం అదే రోజు తన కుటుంబ సభ్యులతో కలసి జగన్ కడప జిల్లాకు బయలుదేరి వెళతారు. ఈ నెల 22వ తేదీన నామినేషన్ దాఖలు చేయనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. వైఎస్ జగన్ సతీమణి భారతి అక్కడే ఉండి జగన్ తరుపున ఇంటింటికీ తిరిగి ప్రచారాన్ని నిర్వహిస్తారని కూడా పార్టీ తెలిపింది.
Next Story