Mon Dec 23 2024 14:06:35 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : జగన్ బస్సు యాత్ర.. ఎన్నికల ప్రచారానికి సిద్ధం
వైసీపీ అధినేత జగన్ బస్సు యాత్రతో జనంలోకి వెళ్లనున్నారు. ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు
వైసీపీ అధినేత జగన్ బస్సు యాత్రతో జనంలోకి వెళ్లనున్నారు. ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో నాలుగు ప్రాంతాల్లో సిద్ధం సభలను నిర్వహించిన జగన్ ఈ నెల 26 లేదా 27వ తేదీ నుంచి బస్సు యాత్రను చేపట్టాలని నిర్ణయించారు. ఈ బస్సు యాత్ర మొత్తం 21 రోజుల పాటు జరగనుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. మేమంతా సిద్ధం పేరుతో ఈ యాత్రను జగన్ చేపడుతున్నారు. కడప జిల్లాలోని ఇడుపుల పాయ నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకూ ఈ బస్సు యాత్ర కొనసాగుతుంది.
నెల రోజుల పాటు ఏకబిగిన...
ఉదయం ప్రజలు, కార్యకర్తలతో ఇంటరాక్ట్ అవుతారు. సాయంత్రం బహిరంగ సభలో పాల్గొంటారు. తొలి విడతగా పార్లమెంటు నియోజకవర్గాలలో బహిరంగ సభను నిర్వహించాలని నిర్ణయించారు. ఎన్నికలు నాలుగో విడత జరగనుండటం, ప్రచారానికి ఎక్కువ సమయం ఉండటంతో ముందు బస్సు యాత్ర నిర్వహిచి ఆ తర్వాత ఎన్నికల ప్రచారాన్ని కూడా అన్ని నియోజకవర్గాల్లో నిర్వహించనున్నారని పార్టీ నేతలు తెలిపారు. ఉదయం ప్రజలతో మమేకమై వారి నుంచి సమస్యలతో పాటు సలహాలను కూడా స్వీకరించనున్నారు. సాయంత్రం బహిరంగ సభల్లో పాల్గొంటారు.
Next Story