Wed Dec 25 2024 05:10:25 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : నేడు తిరుమలకు జగన్
వైసీపీ అధినేత జగన్ నేడు తిరుమలకు వెళ్లనున్నారు. శుక్రవారం రాత్రికి తిరుమలకు చేరుకుని శనివారం వెంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు.
వైసీపీ అధినేత జగన్ నేడు తిరుమలకు వెళ్లనున్నారు. శుక్రవారం రాత్రికి తిరుమలకు చేరుకుని శనివారం వెంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు. శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి రేణిగుంటకు చేరుకుంటారు.అక్కడి నుంచి బయలుదేరి రాత్రి 7 గంటలకు తిరుమలకు చేరుకుంటారు.
రేపు ఉదయం దర్శనం...
రాత్రికి జగన్ తిరుమలలోనే బస చేయనున్నారు. శనివారం ఉదయం 10.20 గంటలకు తాను బస చేసిన గెస్ట్‌హౌస్ నుంచి బయలుదేరి వెంకటేశ్వరస్వామిని దర్శించుకుంటారు. అనంతరం తిరుగు ప్రయాణమవుతారు. అయితే తిరుమ శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలని కూటమి పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ దానిపై సంతకం చేస్తారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. పోలీసులు భారీ బందోబస్తును అలిపిరి నుంచి ఏర్పాటు చేశారు.
Next Story