Thu Dec 19 2024 03:07:17 GMT+0000 (Coordinated Universal Time)
YSRCP : రేపే వైసీపీ కీలక సమావేశం
వైసీపీ అధినేత జగన్ కీలక సమావేశం ఈ నెల 20వ తేదీన నిర్వహించనున్నారు
వైసీపీ అధినేత జగన్ కీలక సమావేశం ఈ నెల 20వ తేదీన నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. ఈ నెల 21, 22 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు ఉండటంతో అందుకు ఒకరోజు ముందు జగన్ ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశం తొలుత ఈ నెల 19వ తేదీన నిర్వహించాల్సి ఉంది. అయితే జగన్ పులివెందుల పర్యటన ఉండటంతో వాయిదా వేసుకున్నారు. తర్వాత 24వ తేదీన నిర్వహించాలని భావించారు.
నేతలందరితోనూ....
కానీ అసెంబ్లీ సమావేశాలను ముందుగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో వైసీపీ సమావేశం కూడాఈ నెల 20వ తేదీన నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటు మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసిన వారంతా హాజరవ్వాలని ఆహ్వానాలు పంపారు. ఓటమి తర్వాత ఇంత పెద్ద స్థాయిలో సమావేశం నిర్వహిస్తున్న జగన్ పార్టీ అధికారంలోకి రాకపోవడానికి గల కారణాలపై విశ్లేషించనున్నారు. భవిష్యత్ ప్రణాళికను నేతలకు వివరించనున్నారు.
Next Story