Sat Dec 28 2024 15:06:18 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : వైఎస్ జగన్ నేడు బెంగళూరుకు.. అందుకేనా?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు బెంగళూరుకు బయలుదేరి వెళ్లనున్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు బెంగళూరుకు బయలుదేరి వెళ్లనున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరి ఆయన బెంగళూరుకు వెళ్లనున్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత వైఎస్ జగన్ హైదరాబాద్ కంటే ఎక్కువ బెంగళూరులోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. అప్పుడప్పుడు తాడేపల్లికి వచ్చి నేతలను కార్యకర్తలను కలుస్తున్నారు.
బెంగళూరు అయితే...?
బెంగళూరు అయితే సురక్షితమని భావించి అక్కడకు వెళుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్ కు వెళితే కొంత ఇబ్బందులు ఎదురవుతాయని భావించి జగన్ బెంగళూరులోనే ఉండటానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. కొద్ది రోజులు అక్కడే ఉండి తిరిగి తాడేపల్లికి చేరుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.
Next Story