Sun Dec 22 2024 23:13:05 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : నేడు నెల్లూరు సెంట్రల్ జైలుకు జగన్
వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు నెల్లూరు జిల్లాకు బయలుదేరి వెళ్లనున్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు నెల్లూరు జిల్లాకు బయలుదేరి వెళ్లనున్నారు. నెల్లూరు జిల్లా జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఆయన పరామర్శించనున్నారు. ఎన్నికల సమయంలో జరిగిన ఘర్షణలతో పిన్నెల్లిపై కేసులు నమోదు కావడంతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేసి నెల్లూరు జైలుకు తరలించారు. నెల్లూరు జిల్లా జైలులో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నేడు జగన్ కలవనున్నారు.
పిన్నెల్లిని కలిసి...
ఉదయం 9.40 గంటలకు తాడేపల్లి నుంచి హెలికాప్టర్ లో బయలు దేరి నెల్లూరుకు చేరుకుంటారు. నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కలిసి ఆయనతో మాట్లాడిన అతనంరం మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి హెలికాప్టర్ ద్వారా తాడేపల్లికి వెళ్లనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత నెల్లూరు జిల్లాకు తొలిసారి జగన్ వస్తుండటంతో పెద్దయెత్తున స్వాగతం పలికేందుకు నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.
Next Story