Thu Dec 19 2024 06:49:37 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : నేడు అనంతపురం నేతలతో జగన్ భేటీ
వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు అనంతపురం జిల్లా నేతలతో సమావేశం కానున్నారు
![ys jagan, ycp chief, meeting, anantapur district ys jagan, ycp chief, meeting, anantapur district](https://www.telugupost.com/h-upload/2024/12/11/1673367-jagan-1.webp)
వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు అనంతపురం జిల్లా నేతలతో సమావేశం కానున్నారు. వరసగా జిల్లాల నేతలతో సమావేశమవుతున్న జగన్ తన పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించారు. వచ్చే నెల మూడోవారం నుంచి జగన్ జిల్లాల పర్యటన ఉండనుండటంతో ముందుగానే జిల్లా నేతలతో ఆయన సమావేశమవుతున్నారు.
![](https://www.telugupost.com/h-upload/2024/12/19/1675224-untitled-design.webp)
పార్టీ బలోపేతంపై...
ఈ సమావేశానికి జిల్లాలోని జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, మున్సిపల్ ఛైర్మన్లు పాల్గొంటారు. మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా పాల్గొననున్నారు. వారికి పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే ప్రజలు ఎదుర్కొంటున్న కీలక సమస్యలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేయడానికి సిద్ధమయ్యారు. నేతలకు పార్టీ బలోపేతం చేయడంపై దిశానిర్దేశం చేయనున్నారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now
Next Story