Thu Dec 19 2024 15:11:06 GMT+0000 (Coordinated Universal Time)
13న ఎమ్మెల్యేలతో జగన్
వైసీపీ అధినేత జగన్ ఈ నెల 13వ తేదీన ఎమ్మెల్యేలు, మంత్రులు, నియోజకవర్గ సమన్వయ కర్తలతో సమావేశం కానున్నారు.
వైసీపీ అధినేత జగన్ ఈ నెల 13వ తేదీన ఎమ్మెల్యేలు, మంత్రులు, నియోజకవర్గ సమన్వయ కర్తలతో సమావేశం కానున్నారు. ప్రధానంగా గృహసారధుల నియామకంపై చర్చించనున్నారు. ప్రతి యాభై ఇళ్లకు ఇద్దరు గృహసారధులను నియమించాలని జగన్ గతంలో జరిగిన సమావేశంలో చెప్పిన సంగతి తెలిసిందే. గత నెల చివరికే గృహసారధుల నియామకం పూర్తి కావాల్సి ఉండగా, చాలా చోట్ల ఈ ప్రక్రియ పూర్తి కాలేదని తెలుస్తోంది.
గృహసారధుల నియామకంపై....
ఇటీవల పార్టీలో జరుగుతున్న పరిణామాలపై కూడా జగన్ నేతలతో చర్చించనున్నారు. వచ్చే ఎన్నికలకు ఎలా సిద్ధమవ్వాలి? ఎక్కడ నేతల్లో అసంతృప్తి ఉంది? అందుకు కారణాలు? విభేదాల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో జగన్ చర్చించనున్నారు. భవిష్యత్ కార్యాచరణపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.
Next Story