Mon Dec 23 2024 18:09:34 GMT+0000 (Coordinated Universal Time)
నేడు వైసీపీ నేతలతో జగన్
వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ ఈరోజు ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్ష నిర్వహించనున్నారు
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈరోజు ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్ష నిర్వహించనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో, గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంతో పాటు నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై జగన్ సమీక్షించనున్నారని చెబుతున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకుద సమావేశం జరుగుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఎమ్మెల్యేల పనితీరుపై...
ఎమ్మెల్యేల పనితీరుపై తన వద్ద ఉన్న నివేదికల ఆధారంగా వారికి క్లాస్ పీకనున్నారు. ఈ సమావేశంలో నియోజకవర్గ, ప్రాంతీయ సమన్వయకర్తలు కూడా పాల్గొనాలని ఇప్పటికే పిలుపు వెళ్లింది. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో అందిన వినతుల పరిష్కారం, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. జగనన్నే మన భవిష్యత్ కార్యక్రమంపైనా జగన్ ఈ సమావేశంలో నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.
Next Story