Wed Jan 08 2025 16:07:42 GMT+0000 (Coordinated Universal Time)
పార్టీ నేతలతో సీఎం జగన్ సమీక్ష
పార్టీ నేతలతో వైసీపీ అధినేత జగన్ సమావేశం కానున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షులు, పరిశీలకులతో ఆయన సమావేశం కానున్నారు.
పార్టీ నేతలతో వైసీపీ అధినేత జగన్ సమావేశం కానున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షులు, పరిశీలకులతో ఆయన సమావేశం కానున్నారు. నియోజకవర్గాల పరిశీలకులతో పాటు రీజనల్ కో-ఆర్డినేటర్లు కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు జగన్ పార్టీ నేతలతో సమావేశం అవుతారు. రానున్న ఎన్నికలకు సంబంధించి జగన్ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.
బూత్ లెవెల్ కమిటీ....
గడప గడపకు ప్రభుత్వం పై సమీక్షతో పాటు బూత్ లెవెల్ కమిటీల ఏర్పాటు, ప్రతి యాభై ఇళ్లకు ఒక వాలంటీర్ ను నియమించాలన్న ఉద్దేశ్యంతో ఉన్నారు. ఈ ప్రక్రియను సత్వరం పూర్తి చేయాలని జగన్ నేతలను ఆదేశించనున్నారు. దీంతో పాటు నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై ఆయన తనకు అందిన నివేదికలపై కొంత చర్చించనున్నట్లు తెలిసింది.
Next Story