Thu Dec 19 2024 06:03:51 GMT+0000 (Coordinated Universal Time)
నేడు జగన్ మరో కీలక సమావేశం
వైసీపీ అధినేత జగన్ ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు పార్టీ రీజినల్ కో- ఆర్డినేటర్లతో సమావేశం కానున్నారు
వైసీపీ అధినేత జగన్ ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు పార్టీ రీజినల్ కో- ఆర్డినేటర్లతో సమావేశం కానున్నారు. నిన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులతో సమావేశమైన జగన్ నేడు రీజనల్ కో- ఆర్డినేటర్లతో సమావేశం కానున్నారు. నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై చర్చించనున్నారు.
రీజనల్ కో-ఆర్డినేటర్లతో...
అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితి, అంతర్గత సమస్యలపై వైసీపీ అధినేత జగన్ కు రీజనల్ కో-ఆర్డినేటర్లు నివేదికలు ఇవ్వనున్నారు. గడప-గడపకి మన ప్రభుత్వంతో పాటు పలు నూతన కార్యక్రమాలపై చర్చించనున్నారు. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించిన రీజినల్ కోఆర్డినేటర్ లు సమగ్రమైన నివేదికను రూపొందించి అధినేతకు అందచేయనున్నారు. ఈ నివేదికలను అనుసరించి జగన్ తదుపరి చర్యలు తీసుకుంటారని తెలిసింది.
Next Story