Wed Apr 23 2025 09:43:53 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : నేడు బస్సు యాత్రకు విరామం.. మ్యానిఫేస్టోపై కీలక భేటీ
నేడు సీనియర్ నేతలతో వైసీపీ అధినేత జగన్ సమావేశం కానున్నారు. మ్యానిఫేస్టో పై చర్చించనున్నారు

నేడు సీనియర్ నేతలతో వైసీపీ అధినేత జగన్ సమావేశం కానున్నారు. మ్యానిఫేస్టో పై చర్చించనున్నారు. ఎన్నికలకు పెద్దగా సమయం లేకపోవడంతో మ్యానిఫేస్టోను ఈ నెల 26, 27 తేదీల్లో విడుదల చేయాలని జగన్ భావిస్తున్నారు. ఇప్పటికే ఆయనకు మ్యానిఫేస్టో రూపకల్పన చేసి కమిటీ అందించింది. ఇందులో కొన్ని మార్పులు, చేర్పులు చేయనున్నారని తెలిసింది.
రేపు సోషల్ మీడియా వింగ్ తో...
దీంతో ఈరోజు విశాఖ జిల్లాలో మ్యానిఫేస్టోను ఫైనల్ చేయనున్నారు. అందుకే ఈరోజు మేమంతా సిద్ధం యాత్రకు బ్రేక్ ఇచ్చారు. సీనియర్ నేతలకు ఇప్పటికే విశాఖపట్నం కు రావాలని సమాచారం అందింది. వారి సూచనలు కూడా తీసుకున్న తర్వాత మ్యానిఫేస్టోను ఓకే చేయనున్నారు. రేపు సోషల్ మీడియా వింగ్ తో సమావేశమైన అనంతరం విజయనగరం జిల్లా పర్యటనకు జగన్ బయలుదేరుతారు. ఈ నెల 26వ తేదీన మ్యానిఫేస్టో చేయాలని జగన్ భావిస్తున్నారు.
Next Story