Sun Dec 22 2024 18:03:17 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : నేడు పులివెందులలో జగన్ ప్రజాదర్బార్
వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ నేడు రెండో రోజు పులివెందులలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు
వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ నేడు రెండో రోజు పులివెందులలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. నిన్న మధ్యాహ్నం కడపకు చేరుకున్న వైఎస్ జగన్ కు పార్టీ నేతలు భారీ స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా రిమ్స్ కు వెళ్లి టీడీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన వేంపల్లె కు చెందిన పార్టీ కార్యకర్తను పరామర్శించారు.
ప్రజల నుంచి వినతులను...
నేడు పులివెందులలో వైఎస్ జగన్ ప్రజలతో ముఖాముఖి కలవనున్నారు. క్యాంప్ కార్యాలయంలో ప్రజల నుంచి వినతులను స్వీకరించనున్నారు. జగన్ పులివెందులలో ఉంటారని తెలిసి ఇతర జిల్లాల నుంచి నేతలు, కార్యకర్తలు తరలి వస్తున్నారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. రేపు ఇడుపుల పాయలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద నివాళులర్పించనున్నారు.
Next Story