Mon Apr 07 2025 03:04:16 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : నేడు తాడేపల్లికి వైఎస్ జగన్
వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు తాడేపల్లికి చేరుకోనున్నారు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు తాడేపల్లికి చేరుకోనున్నారు. ఆయన సాయంత్రం నాలుగు గంటలకు బెంగళూరు నుంచి విజయవాడకు చేరుకోనున్నారు. కొద్ది రోజుల క్రితం బెంగళూరు వెళ్లిన జగన్ నేడు తాడేపల్లికి రానుండటంతో ఆయనకు పెద్దయెత్తున స్వాగతం పలికేందుకు పార్టీ నేతలు ఏర్పాట్లు చేశారు.
నేడు హైకోర్టులో...
మరోవైపు నేడు హైకోర్టులో వైఎస్ జగన్ పిటీషన్ పై విచారణ జరగనుంది. తనకు ప్రతిపక్ష హోదా కల్పించాలంటూ జగన్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. మొన్నటి ఎన్నికల్లో కూటమిగా ఏర్పడిన పార్టీలు అధికారంలోకి రాగా, తమను ప్రభుత్వం ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ ఆయన పిటీషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
Next Story