Mon Dec 23 2024 13:36:02 GMT+0000 (Coordinated Universal Time)
YCP BusYatra : నేడు జగన్ ఎన్నికల ప్రచార యాత్ర
వైసీపీ అధినేత జగన్ నేటి నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు.
YCP BusYatra :వైసీపీ అధినేత జగన్ నేటి నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈరోజు ఉదయం గంటలకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరి ఇడుపులపాయకు చేరుకుంటారు. అక్కడ వైఎస్సార్ఘాట్ కు నివాళులర్పించనున్నారు. అనంతరం వేంపల్లి, వీరపునాయునిపల్లె, యర్రగుంట్ల మీదుగా యాత్ర సాగనుంది. తర్వాత ప్రొద్దుటూరులో జరిగే మేమంతా సిద్ధం సభలో ఆయన ప్రసంగించనున్నారు.
21 రోజుల పాటు...
తర్వాత దువ్వూరు, చాగలమర్రి మీదుగా ఆళ్లగడ్డ బైపాస్ వద్ద రాత్రికి బస చేయనున్నారు. రోజుకు ఒక్కో పార్లమెంటు నియోజకవర్గంలో బస్సు యాత్రను చేపడతారు. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ మొత్తం 21 రోజుల పాటు యాత్ర సాగనుంది. ఉదయం వేళ ప్రజలతో సమావేశాలు, సాయంత్రం బహిరంగ సభలతో జగన్ యాత్ర జరగనుంది. యాత్రకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పార్టీ నేతలు పూర్తి చేశారు.
Next Story