Mon Dec 23 2024 04:06:24 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : నేడు అనంతపురం జిల్లాకు జగన్
వైసీపీ అధినేత జగన్ నేడు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. నాలుగో రోజు బస్సు యాత్ర నేడు జరగనుంది
వైసీపీ అధినేత జగన్ నేడు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. నాలుగో రోజు బస్సు యాత్ర నేడు జరగనుంది. మేమంతా సిద్ధం పేరిట ఈ నెల 27న ఇడుపులపాయ నుంచి జగన్ బయలుదేరిన సంగతి తెలిసిందే. ఈరోజు ఉదయం పత్తికొండ నుంచి బయలుదేరి రాతన మీదుగా తుగ్గలి చేరుకుంటారు. ఉదయం పది గంటలకు అక్కడి ప్రజలతో నేరుగా ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. నిన్న రాత్రి ఎమ్మిగనూరులో సభ పూర్తయిన తర్వాత పత్తికొండలో బస చేసిన జగన్ ఉదయం రోడ్డు మార్గాన బయలుదేరి అనంతపురం జిల్లా చేరుకుంటారు.
బహిరంగ సభ అనంతరం...
ఆ తర్వాత జొన్నగిరి, గుత్తి మీదుగా ప్రయాణించి గుత్తి వద్ద మధ్యాహ్నం భోజన విరామానికి ఆగుతారు. సాయంత్రం మూడు గంటలకు పామిడి, కల్లూరు, అనంతపురం బైపాస్ రోడ్డు, రాప్తాడు బైపాస్, ఆకుతోటపల్లి, సంజీవ పురం వరకూ బస్సు యాత్ర సాగుతుంది. సంజీవపురంలో జగన్ రాత్రి బస చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ ప్రసంగించనున్నారు. ఈ మేరకు పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పెద్దయెత్తున పార్టీ కార్యకర్తలను సభకు తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Next Story