Fri Dec 20 2024 06:07:35 GMT+0000 (Coordinated Universal Time)
Attack on Ys Jagan : జగన్ పై దాడి ఘటనతో పోలీసులు అలెర్ట్.. ఇకపై ఆంక్షల మధ్య యాత్ర
వైసీపీ అధినేత జగన్ ఇక బస్సు యాత్ర ఆంక్షల మధ్య జరగనుంది. ఇకపై జగన్ కు వందమీటర్ల దూరంలో ఎవరినీ అనుమతించరు
వైసీపీ అధినేత జగన్ ఇక బస్సు యాత్ర ఆంక్షల మధ్య జరగనుంది. ఇకపై జగన్ కు వందమీటర్ల దూరంలో ఎవరినీ అనుమతించరు. జగన్ బస్సు చుట్టూ బారికేడ్లను నిర్మించాలని నిఘా విభాగం పోలీసు అధికారులకు సూచించింది. జగన్ బస్సులో ఉండే వీలయినంత వరకూ ప్రజలకు అభివాదం చేసేలా చూడాలని కోరింది. జగన్ బస్సు పై మాట్లాడేటప్పుడు కూడా చుట్టూ వంద మీటర్లలోపు నేతలతో సహా ఎవరినీ అనుమతించవద్దని కూడా నిఘా విభాగం పోలీసు అధికారులను ఆదేశించింది.
క్రేన్లతో గజమాలలను...
ఇక క్రేన్లతో గజమాలలను సయితం అనుమతించవద్దని కూడా నిఘా బృందం భద్రతా సిబ్బందికి సూచించినట్లు తెలిపింది. నేతలతో సహా పార్టీ ముఖ్య కార్యకర్తలను ఎవరినీ బస్సు పైకి అనుమతించే టప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. జగన్ నేరుగా కిందకు దిగడం, కనిపించిన వారితో మాట్లాడటం వంటి పనులు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. ఇప్పటికే అనంతపురం జిల్లాలో ఒకసారి జగన్ ప్రసంగిస్తుండగా వెనక వైపు నుంచి చెప్పు వేసిన ఘటనను కూడా ఈ సందర్భంగా నివేదికలో ప్రస్తావించినట్లు సమాచారం.
రౌడీషీటర్లను...
నిన్న జరిగిన దాడిలో ముఖ్యమంత్రి జగన్ తో పాటు పక్కనే ఉన్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావుకు గాయాలయిన నేపథ్యంలో ఆయన ఈరోజు బస్సు యాత్రకు బ్రేక్ ఇచ్చారు. రేపటి నుంచి తిరిగి ఆయన బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. ఈనేపథ్యంలో స్థానిక పోలీసులతో పాటు జగన్ వ్యక్తిగత భద్రత సిబ్బందికి కూడా కొన్ని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఎవరినీ అనుమతించవద్దని, జగన్ పర్యటించే ప్రాంతాల్లో రౌడీషీటర్లను ముందస్తుగా అదుపులోకి తీసుకోవాలని కూడా నిఘా వర్గాలు నివేదికలో సూచించినట్లు తెలిసింది. దీంతో రేపటి నుంచి జగన్ బస్సు యాత్ర ఆంక్షల మధ్య ప్రారంభం కానుంది. పూర్తి స్థాయి నిఘా నీడలో జగన్ రేపటి నుంచి పర్యటించనున్నారు.
Next Story