Sun Dec 22 2024 21:29:59 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : బీమవరంలోకి నేడు వైఎస్ జగన్ బస్సు యాత్ర
వైసీపీ అధినేత జగన్ బస్సు యాత్ర నేడు పశ్చిమ గోదావరి జిల్లాకు చేరకోనుంది
వైసీపీ అధినేత జగన్ బస్సు యాత్ర నేడు పశ్చిమ గోదావరి జిల్లాకు చేరకోనుంది. పదహారో రోజు యాత్రను ఆయన నిన్న బస చేసిన నారాయణపురం దగ్గర నుంచి ప్రారంభిస్తారు. నిన్న గుడివాడ బహిరంగ సభలో పాల్గొన్న తర్వత నారాయణపురం నైట్ క్యాంప్ లో ఉన్నారు. నేడు నిడమర్రు, గణపవరం మీదుగా ఉండి చేరుకుంటారు. ఉండి శివారులో జగన్ భోజన విరామానికి ఆగుతారు.
వెస్ట్ గోదావరిలో...
అనంతరం భీమవరం బైపాస్ రోడ్డులోని గ్రంఢి వెంకటేశ్వరరావు జూనియర్ కళాశాల వద్ద జరిగే బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. సభ పూర్తయిన తర్వాత పిప్పర, పెరవలి, సిద్ధాంతం క్రాస్ మీదుగా ఈతకోట శివారులోని నైట్ క్యాంప్ కు చేరుకుంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. వైఎస్ జగన్ సభ కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన నేతలు పూర్తి చేశారు.
Next Story