Mon Dec 23 2024 12:37:34 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : జగన్ తొలిసభ అక్కడే.. బస్సుయాత్ర షెడ్యూల్ రెడీ
ఈ నెల 27వ తేదీ నుంచి వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ బస్సుయాత్ర ప్రారంభం కానుంది
ఈ నెల 27వ తేదీ నుంచి వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ బస్సుయాత్ర ప్రారంభం కానుంది. ఇడుపుల పాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ ఈ యాత్ర సాగనుంది. మధ్యాహ్నం మూడు గంటలకు వైసీపీ నేతలు బస్సు యాత్ర షెడ్యూల్ ను విడుదల చేయనున్నారు. ఉదయం పూట ప్రజలు, కార్యకర్తలతో జగన్ మాటా మంతీ కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు.
ఇడుపులపాయ నుంచి...
ఈ నెల 27న ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళుర్పించిన అనంతరం జగన్ బస్సుయాత్రను ప్రారంభిస్తారు. పులివెందుల, కమలాపురం మీదుగా బస్సు యాత్ర ప్రొద్దుటూరుకు చేరుకోనుంది. ప్రొద్దుటూరులో ఈ నెల 27న తొలి బహిరంగ సభ జరగనుంది. 28వ తేదీన నంద్యాల జిల్లా, 29న కర్నూలు జిల్లా, 30న హిందూపురంలో జరిగే బహిరంగ సభల్లో జగన్ ప్రసంగించనున్నారు.
Next Story