Sun Dec 22 2024 17:32:19 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : పులివెందులలో నేడు జగన్ ప్రజాదర్బార్
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటన కడప జిల్లాలో కొనసాగుతుంది. రెండో రోజు సొంత నియోజకవర్గమైన పులివెందులలో పర్యటిస్తున్నారు
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటన కడప జిల్లాలో కొనసాగుతుంది. రెండో రోజు ఆయన సొంత నియోజకవర్గమైన పులివెందులలో పర్యటిస్తున్నారు. ఈరోజు ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించనున్నారు. ప్రజాదర్బార్ కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి వాటి పరిష్కారానికి అవసరమైన సూచనలను అధికారులకు తెలియజేస్తున్నారు.
బారులు తీరిన జనం...
నిన్న బెంగళూరు నుంచి కడప ఎయిర్ పోర్టుకు చేరుకున్న జగన్ కు కార్యకర్తలు, నేతలు భారీ సంఖ్యలో వచ్చి స్వాగతం పలికారు. పులివెందులలో ఆయన క్యాంప్ కార్యాలయం వద్దకు కూడా ఈరోజు ప్రజలు బారులు తీరారు. దీంతో పోలీసులు ఎలాంటి తొక్కిసలాట జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. మరో రోజు జగన్ పులివెందులలోనే ఉంటారు
Next Story