Wed Dec 25 2024 05:03:51 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan :జగన్ తిరుమల పర్యటన రద్దు చేసుకుంది అందుకేనా? అసలు రీజన్ అదేనట
వైసీపీ అధినేత వైెఎస్ జగన్ తిరుమల పర్యటన రద్దయింది. తనపై దాడి చేసేందుకు కొందరు కుట్ర చేస్తున్నారని జగన్ ఆరోపించారు.
వైసీపీ అధినేత వైెఎస్ జగన్ తిరుమల పర్యటన రద్దయింది. తనపై దాడి చేసేందకు తిరుపతిలో కొందరు కుట్ర చేస్తున్నారని జగన్ ఆరోపించారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయ మీడియాతో మాట్లాడారు. దేవుడి దర్శనానికి వెళదామంటే అడ్డుకోవడానికి చూడటమేంటని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ లో రాక్షస రాజ్యం నడుస్తుందిని జగన్ అభిప్రాయపడ్డారు. తనకు నోటీసులు ఇచ్చి దైవదర్శనానికి వెళ్లకుండా అడ్డుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నించిందని జగన్ ఆరోపించారు. దైవ దర్శనానికి వెళుతుంటే అడ్డుకోవడం దేశంలో ఇది మొదటి సారి అని జగన్ చెప్పుకొచ్చారు. ఇతర రాష్ట్రాల నుంచి బీజేపీ నేతలను తిరుపతికి రప్పించి అక్కడ ఘర్షణ వాతావరణం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని జగన్ అన్నారు.
నెయ్యిపై దుష్ప్రచారం...
బీజేపీ కేంద్ర నాయకత్వానికి ఈ విషయం తెలుసా? అని జగన్ ప్రశ్నించారు.వేలాది మంది పోలీసులను అక్కడ పెట్టి భయోత్పాతాన్ని సృష్టించేలా వాతావరణాన్ని కల్పించారన్నారు. లడ్డూ పవిత్రతను దెబ్బతిస్తూ చంద్రబాబు దొరికిపోయారని, జంతువుల కొవ్వు కలిపినట్లు దుష్ప్రచారం చేశారని అన్నారు. కేవలం డైవర్షన్ కోసమే ఈ లడ్డూ వివాదాన్ని తెరపైకి తెచ్చారని జగన్ అన్నారు. చంద్రబాబు హయాంలో కూడా పదిహేను సార్లు ట్యాంకర్లను వెనక్కు పంపారన్నారు. తమ హయాంలో పద్దెనిమిది సార్లు వెనక్కి పంపామని చెప్పారు. కల్తీ నెయ్యిని ప్రసాదంలో వాడలేదని ఈవో ఈ నెల 20వ తేదీన చెప్పినప్పటికీ కల్తీ నెయ్యి కలిసిందంటూ అబద్ధాలు చెప్పి చంద్రబాబు తిరుమల పవిత్రతను దెబ్బతీశారాన్నారు.
డిక్లరేషన్ లో అదే రాసుకోండి...
తన మతం, కులం ఏంటో ప్రజలకు తెలుసునన్న జగన్, తన మతం మానవత్వమని అన్నారు. నాలుగు గోడల మధ్య తాను బైబిల్ చదువుతానని చెప్పుకొచ్చారు. అన్ని మతాలను తాను గౌరవిస్తానని, హిందూ మత ఆచారాలను పాటిస్తానని జగన్ తెలిపారు. తన మతం ఏమిటని అడుగుతున్నారని, తన మతం మానవత్వమని ఆయన తెలిపారు. డిక్లరేషన్ లో నా మతం మానవత్వం అని రాసుకోండి అని జగన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కూటమి లోని పార్టీలు చంద్రబాబు లడ్డూపై అపచారం చేసేలా ప్రశ్నిస్తుంటే ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. మతం పేరుతో రాజకీయాలు ఏపీలోనూ మొదలు పెట్టారని జగన్ ఫైర్ అయ్యారు. చంద్రబాబు తన చెప్పు చేతుల్లో ఉండే అధికారులతో సిట్ వేశారన్న అన్న జగన్, రాజకీయాల కోసం హిందూధర్మాన్ని వాడుకుంటున్నారని తెలిపిారు. గతంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, ప్రధానితో తిరుమల వెళ్లినప్పుడు డిక్లరేషన్ ఎందుకు ఇవ్వలేదని జగన్ ప్రశ్నించారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆలయాల్లో చంద్రబాబు పాపాలు ప్రక్షాళన చేయాలంటూ పూజలు చేయాలని వైఎస్ జగన్ పిలుపు నిచ్చారు.
Next Story