Mon Dec 23 2024 07:23:36 GMT+0000 (Coordinated Universal Time)
పోస్టల్ బ్యాలట్ పై సుప్రీంకోర్టుకు వైసీపీ
పోస్టల్ బ్యాలట్ పై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో వైసీపీ స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలు చేసింది.
పోస్టల్ బ్యాలట్ పై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో వైసీపీ స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలు చేసింది. ఈరోజు సుప్రీంకోర్టులో ఎలాంటి తీర్పు వస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది. రేపు ఉదయం ఎనిమిది గంటలకు పోస్టల్ బ్యాలట్ తో తొలుత కౌంటింగ్ ప్రారంభించనున్నారు. ఇంకా గంటల సమయం మాత్రమే ఉంది.
హైకోర్టు తీర్పుపై...
ఈనేపథ్యంలో పోస్టల్ బ్యాలట్ పై అధికారిక సీల్, స్పెసిమన్ సిగ్నేచర్ లేకున్నా ఆమోదించాలన్న ఎన్నికల కమిషన్ ఉత్తర్వులపై వైసీపీ అభ్యంతరం తెలిపింది. అయితే కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేయలేమని హైకోర్టు తెలపడంతో వైసీపీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే ఈరోజు జరిగే వాదనలు విని సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందన్నది మాత్రం చూడాల్సి ఉంది.
Next Story