Thu Dec 19 2024 09:54:57 GMT+0000 (Coordinated Universal Time)
Sajjala : చంద్రబాబు దిగజారుడుతనానికి ఇది నిదర్శనం కాదా?
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను 2019లో టీడీపీ ఎందుకు ఆమోదించిందని ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై 2019లో టీడీపీ ఎందుకు ఆమోదించిందని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. శాసనసభలో పయ్యావుల కేశవ్ మాట్లాడిన వీడియోను మీడియా సమావేశంలో పెట్టారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ దుష్ప్రచారం చేస్తుందన్నారు. 2019 జులై 29న ఈ బిల్లును టీడీపీ ఆమోదించిందన్నారు. శాసనమండలిలో టీడీపీ అధినేత కుమారుడు నారా లోకేష్ కూడా ఈ బిల్లును ఆమోదించిన వారిలో ఉన్నారన్నారు. చంద్రబాబు కేవలం ప్రజలను భయపెట్టడానికే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను అనవసరంగా వివాదంలోకి తెచ్చి ఓట్లు దండుకోవడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. చంద్రబాబు దిగజారుడుతనానికి నిదర్శనమని అన్నారు. చంద్రబాబులో భయం ఉండటం వల్లనే ఇలాంటి తప్పుడు ప్రచారానికి దిగుతున్నారన్నారు.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల...
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల నష్టం ఏమీ ఉండదని అన్నారు. ప్రభుత్వం పూచీకత్తు ఇస్తుందన్నారు. రైతులకు పూర్తి రక్షణ ఇచ్చే చట్టమని అందరూ అంగీకరించే విషయమని అన్నారు. చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంగా ఉన్నప్పుడే ఈ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టామన్నారు. కేవలం అబద్ధాలు ఎందుకు ప్రచారం చేస్తున్నారన్నారు. 2019లో బిల్లు ఆమోదం పొందితే ఎన్నికల సమయంలో ఎందుకు దానిని బయటకు తెచ్చారని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. ఈ ఐదేళ్ల పాటు ఈ యాక్ట్ పై టీడీపీ నేతలు ఎందుకు యాగీ చేయలేదని, ఎందుకు ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదన్నారు. నీతి అయోగ్ ప్రతిపాదించిన చట్టాన్నే వైసీపీ ప్రభుత్వం శాసనసభలో ఆమోదించిందన్నారు. మరి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను బీజేపీ పాలిత రాష్ట్రంలో అమలు చేయడం లేదా? అని ప్రశ్నించారు. ఒక అబద్ధాన్ని నిజం చేయాలన్న ప్రయత్నమే ఇందులో కనపడుతుందన్నారు.
Next Story