Fri Dec 20 2024 08:55:11 GMT+0000 (Coordinated Universal Time)
అది షర్మిల ఇష్టం : సజ్జల రామకృష్ణారెడ్డి
కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో వైఎస్ షర్మిల మద్దతివ్వడంపై వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు
కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో వైఎస్ షర్మిల మద్దతివ్వడంపై వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. రాజకీయ పార్టీ పెట్టినప్పుడు ఆమె నిర్ణయం ఆమె ఇష్టమేనని అన్నారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ పై ఏ పార్టీ వేధించి కేసులు పెట్టిందో ఆ పార్టీతో చేతులు కలపడాన్ని ఆమె ఇష్టానికే వదిలేస్తున్నామన్నారు. నాడు సోనియా గాంధీని కలిసిన వారిలో షర్మిల కూడా ఉన్నారని, ఆమె ఒక పార్టీకి అధ్యక్షురాలని, ఆమె నిర్ణయాలు ఆమె ఇష్టమని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
చంద్రబాబుపై కేసులు...
అలాగే తమ ప్రభుత్వం చంద్రబాబు పై చాలా తక్కువ కేసులు పెడుతుందన్నారు. ఉచితం అని చెప్పి ఇసుకలో మార్కెట్ లో లోడింగ్, రవాణా మీద దొరికిందా చెప్పాలన్నారు. ఉచితంగా అంటే క్రేన్ లు, బోట్లతో ఎవరు తోడారని ఆయన ప్రశ్నించారు. ఎన్జీటీ ఎందుకు జరిమానా విధించిందో చెప్పాలని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. మద్యంలో కూడా ప్రివిలేజ్ సెస్ వేసి తర్వాత దానిని తొలిగించారన్నారు. ఈ వ్యవహారాల్లో ఆధారాలున్నాయి కాబట్టే కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. ఏపీ బీజేపీ చీఫ్ పురంద్రీశ్వరి కేవలం చంద్రబాబు కుటుంబానికే ప్రాతినిధ్యం వహిస్తున్నారని అన్నారు.
Next Story