Thu Dec 19 2024 01:25:46 GMT+0000 (Coordinated Universal Time)
YSRCP : రాజకీయ కక్షలతోనే దాడులకు తెగబడుతున్నారు
రాజకీయ కక్షలతో దాడులకు తెగబడుతున్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు
రాజకీయ కక్షలతో దాడులకు తెగబడుతున్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారన్నారు. బడుగు, బలహీనవర్గాలపైనే ఎక్కువగా ఈ దాడులు జరుగుతున్నాయని ఆయన అన్నారు. ఎన్నికల కమిషన్ కూడా ఉదాసీనంగా వ్యవహరిస్తుందని ఆయన అన్నారు. ఈసీ పక్షపాత ధోరణితోనే ఉందని సజ్జల రామకృష్ణారెడ్డి అభిప్రాయపడ్డారు. పాలనలో వైసీపీ ప్రభుత్వం జోక్యం ఏమీ లేదన్నారు.
రెచ్చగొట్టేలా వ్యవహరిస్తూ....
జగన్ అస్సలు పట్టించుకోవడం లేదన్నారు. ఏదైనా అర్జెంట్ ఫైలు మీద మాత్రమే సంతకాలు పెడుతున్నారు తప్పించి శాంతిభద్రతలను పర్యవేక్షించాల్సిన బాధ్యత డీజీపీ, చీఫ్ సెక్రటరీలపైనే ఉందన్నారు. పోలింగ్ రోజు నుంచి టీడీపీ నేతలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారన్నారు. వైసీపీ నేతలు సంయమనంతో ఉన్నారని, ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయిన తర్వాత 28 మంది పోలీసు అధికారులను బదిలీ చేయించి మరీ దాడులకు తెగపడుతున్నారన్నారు. కూటమి నేతలు ఫిర్యాదు చేసే వాటికి ఎక్కడైనా ఆధారాలున్నాయా? అని ఆయన ప్రశ్నించారు.
Next Story