Sun Dec 22 2024 21:37:22 GMT+0000 (Coordinated Universal Time)
బాబు మళ్లీ బ్లాక్ మెయిల్ కు దిగుతున్నారు : సజ్జల
చంద్రబాబు పెన్షన్లు అందకుండా మరోసారి కుట్రలు చేస్తున్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు
చంద్రబాబు పెన్షన్లు అందకుండా మరోసారి కుట్రలు చేస్తున్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ సాఫీగా సాగుతున్న పింఛను పంపిణీ వ్యవహారాన్ని అడ్డుకున్నది చంద్రబాబు అని అన్నారు. పెన్షన్ లు ఇవ్వకుండా కుట్రలకు దిగారని ఆయన ఆరోపించారు. పెన్షనర్ల కోపానికి గురికావాల్సి వస్తుందని చంద్రబాబు భయపడిపోతున్నారన్నారు. వాలంటీర్ల సేవలను అడ్డుకున్నది చంద్రబాబు కాదా అని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు.
ఢిల్లీలో మకాం వేసి...
ఎన్నికల కమిషన్ చెప్పినట్లే అధికారులు చేస్తున్నా ఇప్పుడు అధికారులపై వత్తిడి తెస్తూ కొత్త డ్రామాకు తెరదీస్తున్నారన్నారు. చంద్రబాబు అధికారులను బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. బ్యాంకు అకౌంట్లు లేని వారికి ఇంటికి వెళ్లి పెన్షన్ అందిస్తామని చెప్పినందుకు చంద్రబాబు ఆగ్రహం చూస్తుంటే పెన్షన్లు ఆపుతుంది జగన్ అనే రీతిలో మాట్లాడుతున్నారన్నారు. చంద్రబాబు ఏజెంట్లు ఢిల్లీలో మకాం వేసి ఎన్నికల కమిషన్ అధికారులపై వత్తిడి తెస్తున్నారని అన్నారు. చంద్రబాబు వన్నీ సంధి ప్రేలాపనలు అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
Next Story