Fri Dec 27 2024 13:27:21 GMT+0000 (Coordinated Universal Time)
వాళ్లిద్దరూ ఇద్దరే.. మోసగాళ్లు
చంద్రబాబు అవినీతిపై స్పష్టమైన ఆధారాలున్నాయని పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
చంద్రబాబు అవినీతిపై స్పష్టమైన ఆధారాలున్నాయని పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియ సమావేశంలో మాట్లాడారు. ఈ కేసులో ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం జరుగుతుందన్నారు. జైలులో ఉంటే ఆయనకు అనేక రోగాలు వస్తున్నాయన్న ప్రచారం చేస్తున్నారన్నారు. రామోజీ షేర్ల బెదిరింపుల పర్వం కూడా వెలుగులోకి వచ్చిందన్నారు. ఆయన బెదిరించి షేర్లను బదిలీ చేయించుకున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. అవి కూడా ఆధారాలతో బయటకు వచ్చిందని ఆయన అన్నారు.
జీజే రెడ్డిని...
పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు వెన్నుదన్నుగా నిలవడానికి ఒక వర్గం మీడియా ప్రయత్నిస్తుందని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చంద్రబాబు, రామోజీ తప్పులు చేసి ప్రజల మద్దతు కోరుతున్నారన్నారు. వీరి అసలు స్వరూపం బయటపడుతున్న కొద్దీ ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. చంద్రబాబు ఆరోగ్యం పేరుతో టీడీపీ నేతలు డ్రామాలు ఆడుతున్నారన్నారు. సమాజంలో నీచమైన పనులు చేస్తూ తమను పెంచిన వారినే కాటు వేసే నైజం ఇద్దరిదీ అని సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు.
అవినీతి బయటపడిందని...
వీళ్లు పెద్దమనుషులా? రాక్షసులా? అని ప్రశ్నించారు. సాయం చేసిన వారిని జీవితంతా గుర్తుపెట్టుకుంటామని, కానీ ఈ ఇద్దరూ సాయం చేసిన వారినే మోసం చేశారని అన్నారు. ఈ రకమైన స్వభావం ఉన్న వాళ్లు ఏవైనా చేయగలరని ప్రజలు అర్థం చేసుకోవాలని ఆయన కోరారు. ముఖ్యమంత్రి అయిన రెండు నెలలకే చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. జనం డబ్బులు ఎక్కడికి పోయాయని ఆయన ప్రశ్నించారు. ఆధారాలున్నా తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. కోర్టు తీర్పులు ఎలా వచ్చినా జనం మాత్రం ఖచ్చితంగా అవినీతి జరిగిందని నమ్ముతున్నారన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఎవరిని మభ్యపెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.
Next Story