Sun Dec 22 2024 22:24:00 GMT+0000 (Coordinated Universal Time)
నెల్లూరులో వైసీపీకి బిగ్ షాక్
నెల్లూరులో వైసీపీకి భారీ షాక్ తగిలింది. నెల్లూరు మేయర్ స్రవంతి వైసీపీకి రాజీనామా చేశారు
నెల్లూరులో వైసీపీకి భారీ షాక్ తగిలింది. నెల్లూరు మేయర్ స్రవంతి వైసీపీకి రాజీనామా చేశారు. మేయర్ పొట్టూరి స్రవంతితో పాటు భర్త జయవర్ధన్ కూడా పార్టీకి రాజీనామా చేశారు. తాము రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెంట నడుస్తామని వారు తెలిపారు. తాము అపట్లో అధికార పార్టీ వత్తిడితోనే కోటంరెడ్డికి దూరం కావాల్సి వచ్చిందని చెప్పారు. తమపై వత్తిడి అధికంగా ఉండటం వల్లనే వైసీపీలో కొనసాగాల్సి వచ్చిందని స్రవంతి వివరణ ఇచ్చారు.
మేయర్ రాజీనామా...
అయితే తాము కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి వ్యతిరేకం కాదని తెలిపారు. తమను మంచి మనసుతో కోటంరెడ్డి పార్టీలోకి తీసుకోవాలని స్రవంతి కోరారు. శ్రీధర్ రెడ్డి వైసీపీని వీడినప్పుడు ఆయన వెంట నడిచేందుకు సిద్ధమయ్యామని, అయితే తర్వాత వైసీపీ నేతలు చేసిన ఒత్తిడితోనే అక్కడ ఉండాల్సి వచ్చిందన్నారు. తమ తప్పులను మన్నించి అక్కున చేర్చుకోవాలని ఆమె కోరారు.
Next Story