Thu Dec 19 2024 12:11:22 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : నలుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు
వైసీపీ సీరియస్ నిర్ణయం తీసుకుంది. పార్టీ లైన్ దాటిన ఎమ్మెల్యేలు. ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు చేసింది
వైసీపీ అధినాయకత్వం సీరియస్ నిర్ణయం తీసుకుంది. పార్టీ లైన్ దాటిన ఎమ్మెల్యేలు. ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్, మండలి ఛైర్మన్ కు ఫిర్యాదు చేసింది. ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డిలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ తమ్మినేని సీతారాంకు ఫిర్యాదు చేసింది. పార్టీ లైన్ దాటి పనిచేశారంటూ స్పీకర్ కు ఫిర్యాదు చేసింది. ఆధారాలను కూడా సమర్పించింది.
స్పీకర్ కు ఫిర్యాదు...
ఇక ఎమ్మెల్సీలు వంశీకృష్ణ యాదవ్, సి. రామచంద్రయ్యలపై కూడా అనర్హత వేటు వేయాలని కూడా మండలి ఛైర్మన్ మోషెన్ రాజు కు ఫిర్యాదు చేసింది.వంశీకృష్ణ యాదవ్ వైసీపీ ఎమ్మెల్సీగా ఉండి జనసేన పార్టీలో చేరగా, సి. రామచంద్రయ్య టీడీపీలో చేరడాన్ని సీరియస్ గా తీసుకుని చర్యలకు సిద్ధమయింది. అయితే వీరిపై అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు చేయగా స్పీకర్, మండలి ఛైర్మన్ నిర్ణయంపై ఆధారపడి ఉంది.
Next Story